తెలంగాణ

telangana

ETV Bharat / state

అంబులెన్స్​ డోరు తెరుచుకోక వ్యక్తి మృతి - 108

ఎంఎంటీఎస్​లో ప్రయాణిస్తున్న ప్రయాణికుడికి ఆకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. తోటి ప్రయాణికులు వెంటనే అంబులెన్సుకు సమాచారమందించారు. అక్కడికి చేరుకున్న అంబులెన్సు డోరు... 20 నిమిషాలైనా తెరుచుకోలేదు. గ్లాస్​ పగలగొట్టి డోరు తీసేలోగా ఆ వ్యక్తి ప్రాణం పోయింది. ఈ విషాద ఘటన హైదరాబాద్​ మలక్​పేటలో చోటుచేసుకుంది.

అంబులెన్సు

By

Published : Aug 21, 2019, 10:07 AM IST

Updated : Aug 21, 2019, 11:13 AM IST

హైదరాబాద్​ బేగంపేట్​ నుంచి ఎంఎంటీఎస్​లో​ ప్రయాణిస్తున్న ఆనంద్​ అనే ప్రయాణికుడికి గుండె పోటు వచ్చింది. తోటి ప్రయాణికులు 108, 100కు సమాచారమిచ్చారు. మలక్​పేట రైల్వేస్టేషన్​లో ఆనంద్​ను ఆసుపత్రికి తరలించేందుకు అంబులెన్సు వచ్చింది. కానీ 108 వాహనం డోర్​ 20 నిమిషాల పాటు తెరుచుకోకుండా సతయించింది. చివరికి గ్లాస్​ పగలగొట్టి తీసేలోపే ఆనంద్​ మృతి చెందాడు. వాహనం డోర్​ సరైన సమయానికి తెరుచుకుని ఉంటే ఆ వ్యక్తి బతికేవాడని ప్రయాణికులు వాపోయారు. మృతదేహాన్ని పోస్ట్​ మార్టం కోసం ఉస్మానియాకు తరలించారు.

అంబులెన్స్​ డోరు తెరుచుకోక వ్యక్తి మృతి
Last Updated : Aug 21, 2019, 11:13 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details