గత ఆదివారం ఉజ్జయినీ అమ్మవారి బోనాలతో ప్రారంభమై నేడు హైదరాబాద్ అంతటా జరుగుతున్నాయి. అంబర్‌పేట మహంకాళీ అమ్మవారి దేవాలయంలో బోనాల ఉత్సవాలు అంబరాన్నంటుతున్నాయి. ఇవాళ ఉదయం నుంచే భక్తులు వేలాదిగా తరలివచ్చారు. మహిళలు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనాలు, చీరె, సారె సమర్పించుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు.
అంబర్‌పేటలో వైభవంగా మహాంకాళి అమ్మవారి బోనాలు - indrakaran reddy
అంబర్‌పేటలో మహాంకాళి అమ్మవారి బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు వేలాదిగా తరలివచ్చి అమ్మవారికి బోనాలు, చీరె, సారె సమర్పిస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా దేవాలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. పోలీస్ శాఖ బందోబస్తు చేపట్టింది.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కుటుంబసమేతంగా హాజరై పూజలు చేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో అత్యంత శోభాయమానంగా మహిళలు బోనాల ఉత్సవాలు జరుపుకుంటారు. అందరినీ ఆశీర్వదించాలని, సుఖ సంతోషాలతో ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలు వర్థిల్లాలని అమ్మవారిని కోరుకున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఇతర ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు.
ఇదీ చూడండి: జైపాల్‌రెడ్డి మరణం దేశానికి తీరని లోటు: కోమటిరెడ్డి