ఓయూలో అంబేడ్కర్ పరిశోధన కేంద్రం ప్రారంభం - sukdev tarot
ఓయూలో అంబేడ్కర్ పరిశోధన కేంద్రాన్ని యూజీసీ మాజీ ఛైర్మన్ సుకుదేవ్ తరోట్, ఎస్సీ కమిషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ప్రారంభించారు. ఉస్మానియా గ్రంథాలయానికి అంబేడ్కర్ లైబ్రరీగా నామకరణం చేశారు.
పరిశోధక విద్యార్థులకు అందుబాటులో ఉండే విధంగా ఓయూలో అంబేడ్కర్ పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి యూజీసీ మాజీ ఛైర్మన్ సుకుదేవ్ తరోట్, తెలంగాణ ఎస్సీ కమిషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ హాజరయ్యారు. భారత దేశం గర్వించ దగ్గ వ్యక్తి, స్వేచ్ఛ సమానత్వాలను కల్పించిన మహనీయుడు అంబేడ్కర్ అని ఎస్సీ కమిషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ కొనియాడారు. ఆయన పేరుమీద పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో ఓయూ వీసీ ఆచార్య రామచంద్రం, ఆచార్య లింబాద్రి, సిబ్బంది పాల్గొన్నారు.