తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎల్బీ నగర్​లో ఘనంగా అంబేడ్కర్​ జయంతి వేడుకలు

భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్​ అంబేడ్కర్​ జయంతి వేడుకలను ఎల్బీనగర్​లో ఘనంగా నిర్వహించారు. అంబేడ్కర్​ ఉత్సవ కమిటీ నాయకులు కూడలిలో ఉన్న అంబేడ్కర్​, జగ్జీవన్​రామ్​ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

అంబేడ్కర్​ జయంతి వేడుకలు

By

Published : Apr 15, 2019, 5:58 AM IST

అంబేడ్కర్​ జయంతి వేడుకలు

హైదరాబాద్ ఎల్బీ నగర్ కూడలిలో అంబేడ్కర్​ 128వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కూడలిలో ఉన్న అంబేద్కర్, జగ్జీవన్​రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి పలువురు నివాళులర్పించారు. ఈ వేడుకల్లో రంగారెడ్డి జిల్లా తెదేపా అధ్యక్షుడు సామ రంగారెడ్డి, అంబేడ్కర్ ఉత్సవ కమిటీ నాయకులు పాల్గొన్నారు. పంజాగుట్టలో అంబేడ్కర్​ విగ్రహాన్ని తొలగించడంపై జీహెచ్ఎంసీ సిబ్బందిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
రంగారెడ్డి జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేడ్కర్, జ్యోతిరావు పూలే, గాంధీ చిత్ర పటాలకు పూలమాలలు వేసి న్యాయవాదులు నివాళులు అర్పించారు.

ABOUT THE AUTHOR

...view details