ఏపీ రాజధాని రైతులు, మహిళల మహాపాదయాత్ర కొనసాగుతోంది. గుంటూరు జిల్లా పెదనందిపాడులో ఆరో రోజు రైతుల పాదయాత్ర ప్రారంభమైంది. వారు సాయంత్రానికి ప్రకాశం జిల్లాలోని పర్చూరుకు చేరుకోనున్నారు. ఇవాళ 14 కి.మీ. మేర రైతుల పాదయాత్ర సాగనుంది. రాజధాని కోసం వేల ఎకరాలు భూమి ఇచ్చిన రైతులను నాగులపాడు గ్రామానికి చెందిన ప్రవాసాంధ్రులు, గ్రామస్థులు పాదపూజ చేశారు. రైతుల పాదాలపై పూలు చల్లి పూజ జరిపారు. పాదయాత్ర చేస్తున్న రైతులకు ఇబ్బంది లేకుండా నడిచేందుకు 150 మంది రైతులకు బూట్లు, గొడుగులు అందజేశారు. ప్రజలు చూపించిన అభిమానంపై రైతులు ఆనందం వ్యక్తం చేశారు.
Amaravati Farmers: ఆరో రోజు..'న్యాయస్థానం-దేవస్థానం' మహాపాదయాత్ర - guntur district news
ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా పెదనందిపాడు నుంచి రైతుల ఆరో రోజు మహా పాదయాత్ర ప్రారంభమైంది. సాయంత్రానికి వారు ప్రకాశం జిల్లాకు చేరుకోనున్నారు. మహాపాదయాత్ర చేస్తున్న రైతులకు గ్రామస్థులు బూట్లు, గొడుగులు అందించారు.
Amaravati Farmers: ఆరో రోజు..'న్యాయస్థానం-దేవస్థానం' మహాపాదయాత్ర
3 రాజధానులు, సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా తలపెట్టిన ఈ పాదయాత్ర 45 రోజుల పాటు సాగనుంది. డిసెంబర్ 15న పాదయాత్ర తిరుమలకు చేరుకునేలా రాజధాని రైతులు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు.
ఇదీ చదవండి:AIMS: గ్రామీణులకు అత్యాధునిక వైద్యం.. రూ. 10కే ఏడాదంతా ఓపీ