ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంలో వివిధ పిటిషన్లపై విచారణను ఆ రాష్ట్ర హైకోర్టు అక్టోబరు 5కి వాయిదా వేసింది. ఈలోగా ఏపీ ప్రభుత్వం తరఫున కౌంటర్లు దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది.
'అక్టోబరు 5 వరకు అమరావతికి స్టేటస్ కో ' - అమరావతి తాజా వార్తలు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించిన వివిధ పిటిషన్లపై విచారణను ఏపీ హైకోర్టు అక్టోబరు 5కి వాయిదా వేసింది. అక్టోబర్ 5 వరకూ స్టేటస్ కో కొనసాగుతుందని న్యాయస్థానం ఆదేశించిందని న్యాయవాది శ్రీనివాసరావు తెలిపారు.
amaravathi
సాంకేతిక కారణాలరీత్యా భౌతికంగా, ఆన్లైన్, హైబ్రిడ్ విధానంలో విచారణ చేపట్టాలని కొందరు న్యాయమూర్తులు కోరగా... వాటిని పరిశీలిస్తామని హైకోర్టు తెలిపింది. అక్టోబర్ 5 వరకూ స్టేటస్ కో కొనసాగుతుందని న్యాయస్థానం ఆదేశించిందని న్యాయవాది శ్రీనివాసరావు తెలిపారు.
ఇదీచూడండి..'కేంద్ర వ్యవసాయ బిల్లు.. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం'