Alluri Sitaramaraju Birth Anniversary: ఆంధ్రప్రదేశ్‌లో నిర్మిస్తున్న అల్లూరి స్మారక మందిరాన్ని త్వరలోనే తెలుగు ప్రజలకు అంకితం చేయనున్నట్లు కేంద్ర సాంస్కతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. త్వరలోనే అల్లూరి స్వగ్రామాన్ని సందర్శించి స్మారక మందిర పనులను పర్యవేక్షించనున్నట్లు వెల్లడించారు. అల్లూరి 125వ జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్ ఫిల్మ్‌నగర్ కల్చరల్ క్లబ్లో క్షత్రియా సేవా సంస్థ ప్రత్యేకంగా వేడుకలను నిర్వహించింది. ఈ వేడుకలకు కిషన్ రెడ్డితోపాటు మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్, సినీనటులు మోహన్ బాబు, సూపర్ స్టార్ కృష్ణ హాజరయ్యారు. అల్లూరి 125వ జయంతి ఉత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించి స్వాతంత్య్ర పోరాటంలో అల్లూరి వీరత్వాన్ని గుర్తు చేసుకున్నారు.
ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజుగా నటించిన సూపర్ స్టార్ కృష్ణను అతిథులు ఘనంగా సన్మానించారు. అల్లూరి విగ్రహాన్ని పార్లమెంట్ ఆవరణలో ఏర్పాటు చేయాలని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరారు. అల్లూరి జయంతి ఉత్సవాలను ఏడాది పొడవునా నిర్వహించాలని కిషన్ రెడ్డి నిర్వాహకులకు సూచించారు. ఏపీలో అల్లూరి స్మారక మందిరాన్ని త్వరలోనే తెలుగు ప్రజలకు అంకితం చేస్తామని, హైదరాబాద్‌లోనూ ప్రత్యేకంగా మ్యూజియం నిర్మాణానికి కేంద్రం 18 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు. అలాగే ఆజాదీకా అమృతోత్సవాల్లో భాగంగా ఈ సంక్రాంతి ముగ్గుల్లో ఆడపడుచులు దేశభక్తిని ప్రతిబింబించేలా రంగవల్లులు వేయాలని కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్‌లో ప్రత్యేక మ్యూజియం...
ఈ జులై నుంచి అల్లూరి 125వ జయంతి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. కాబట్టి సంవత్సరం పాటుగా అనేక కార్యక్రమాలు చేయాలని సేవాసమితిని కోరుతున్నాను. ఆజాదీ కా అమృత్ మహోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లో ప్రత్యేక మ్యూజియం ఏర్పాటు చేయాలని కేంద్రం 18కోట్ల రూపాయలను మంజూరు చేసింది.
--కిషన్ రెడ్డి, కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి
ఒక ప్రాంతానికే చెందిన వ్యక్తి కాదు..