తెలంగాణ

telangana

ETV Bharat / state

LAND ALLOCATION: ఉగ్రదాడిలో మరణించిన అధికారి భార్యకు భూమి కేటాయింపు - telangana latest news

2008లో కాబుల్​ ఉగ్రదాడిలో మరణించిన ఏఎఫ్​ఎస్​ అధికారి భార్యకు ప్రభుత్వం భూమిని కేటాయించింది. షేక్​పేట పరిధిలోని సర్వే నెంబర్ 403లో 475 గజాల భూమిని కేటాయిస్తూ.. సీఎస్ సోమేశ్​కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

LAND ALLOTTED: ఉగ్రదాడిలో మరణించిన అధికారి భార్యకు భూమి కేటాయింపు
LAND ALLOTTED: ఉగ్రదాడిలో మరణించిన అధికారి భార్యకు భూమి కేటాయింపు

By

Published : Aug 18, 2021, 3:59 PM IST

కాబుల్ ఉగ్రదాడిలో మరణించిన ఏఎఫ్ఎస్ అధికారి వెంకటేశ్వరరావు భార్య మాలతీరావుకు ప్రభుత్వం 475 గజాల భూమిని కేటాయించింది. షేక్​పేట పరిధిలోని సర్వే నెంబర్ 403లో భూమి కేటాయిస్తూ.. సీఎస్ సోమేశ్​కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

2008 కాబుల్ ఉగ్రవాదుల దాడిలో వెంకటేశ్వరరావు మరణించగా.. 2014లో జూబ్లీహిల్స్​లో 475 గజాల భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భూ విస్తీర్ణం తక్కువగా ఉండటంతో హైకోర్టును ఆశ్రయించగా.. ప్రత్యామ్నాయ భూమి కేటాయించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వం షేక్​పేట పరిధిలో భూమిని కేటాయించింది.

ఇదీ చూడండి: తాలిబన్ 2.0 అరాచకాలు షురూ- విగ్రహం ధ్వంసం

ABOUT THE AUTHOR

...view details