తెలంగాణ

telangana

ETV Bharat / state

పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం - CLASS

రాష్ట్రంలో పరీక్షా సమయం నడుస్తోంది. ఇవాళ్టితో ఇంటర్మీడియట్​ ఎగ్జామ్స్​ అయిపోగా... మరో మూడు రోజుల్లో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. వీటి కోసం హైదరాబాద్​ జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు.

ఇక పరీక్షలే తరువాయి..!

By

Published : Mar 13, 2019, 5:30 PM IST

Updated : Mar 13, 2019, 6:37 PM IST

ఇక పరీక్షలే తరువాయి..!
ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తైనట్లు హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటనర్సమ్మ తెలిపారు. మొత్తం 306 కేంద్రాల్లో 69,255 మంది రెగ్యులర్ , 57 కేంద్రాల్లో 12,560 మంది ప్రైవేటు విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా ఇంగ్లీష్​ పరీక్షను మూడో తేదిన నిర్వహిస్తున్న విషయాన్ని గమనించాలని గుర్తు చేశారు.

ముందే చేరుకోవటం మంచిది...!
''అభ్యర్థులు సెంటర్​కి గంట ముందుగానే చేరుకోవాలి... ఎందుకంటే 9:35 నిమిషాల తరువాత వెళ్లినా కేంద్రాల్లోకి అనుమతించరు. సకాలంలో హల్ టికెట్లు అందనివారు లేదా... పోగొట్టుకున్న విద్యార్థులు www.bse.telangana.gov.inవెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. బషీర్​బాగ్​లోని డీఈవో కార్యాలయంలో కంట్రోల్​రూమ్ ఏర్పాటు చేస్తున్నారు. ఎటువంటి సందేహాలున్నా... 040-29701474 నెంబర్​కు ఫోన్​ చేసి నివృత్తి చేసుకోవచ్చు'' అని డీఈవో వెంకటనర్సమ్మ వివరించారు.

Last Updated : Mar 13, 2019, 6:37 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details