భూ ప్రక్షాళన చేసిన తరువాత రెవెన్యూ చట్టాన్ని మార్చాలని అఖిలపక్షం డిమాండ్ చేసింది. సమగ్ర చర్చల తర్వాతే రెవెన్యూ చట్టాలలో మార్పులు చేయాలన్న అంశంపై సీపీఐ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెజాస అధ్యక్షుడు ఆచార్య కోదండరామ్, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డితో పాటు పలువురు రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు. భూ ప్రక్షాళన పేరుతో రైతుల జీవితాలు రోడ్డున పడ్డాయని... కొత్త రెవెన్యూ చట్టంలో రైతుల సమస్యల పరిష్కారం కోసం సూచనలు చేయాలని కోరారు. ఈ అంశంపై ప్రభుత్వం దిగిరాక పోతే గవర్నర్ను కలుస్తామని... అప్పటికీ స్పందించకపోతే ప్రత్యక్ష ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
కేసీఆర్ నిర్ణయాలు ఏకపక్షంగా ఉన్నాయి: అఖిలపక్షం - కేసీఆర్ నిర్ణయాలు ఏకపక్షంగా ఉన్నాయి
కొత్త రెవెన్యూ చట్టంలో మార్పులు చేయాలన్న అంశంపై సీపీఐ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో అఖిలపక్షం ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. భూ ప్రక్షాళన పేరుతో ప్రభుత్వం రైతుల జీవితాలను రోడ్డున పడేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ నిర్ణయాలు ఏకపక్షంగా ఉన్నాయి: అఖిలపక్షం