తెలంగాణలో పరిస్థితులు చూస్తుంటే... రాష్ట్రం కేసీఆర్ ఎస్టేట్‌గా, రాచరిక వ్యవస్థ కిందకు మారిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగించాల్సిన డబ్బును ఓటర్లను, ప్రజాప్రతినిధులను కొనడానికి కేసీఆర్ ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న ఆయన... ప్రతిపక్షం ఉంటే ప్రభుత్వ అక్రమాలు బయట పడతాయనే శాసన సభ్యులను కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ ఎస్టేట్‌గా రాష్ట్రం మారిపోతుంది: భట్టి - 'కేసీఆర్ ఎస్టేట్‌గా రాష్ట్రం మారిపోతుంది': భట్టి విక్రమార్క
హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో అఖిలపక్ష సమావేశం జరుగుతోంది. భేటీలో పాల్గొన్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కేసీఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రాజెక్టుల్లో దోచుకున్న సొమ్మును ఓటర్లను, ప్రజాప్రతినిధులను కొనడానికి ఉపయోగిస్తున్నారని ఆరోపించారు.
'కేసీఆర్ ఎస్టేట్‌గా రాష్ట్రం మారిపోతుంది'
Last Updated : Mar 23, 2019, 3:54 PM IST