తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఐఏఎస్​లే రాజకీయ నాయకుల్లా వ్యవహరిస్తే' - tsrtc strike today updates

కార్మికుల సమ్మెపై హైకోర్టులో ఆర్టీసీ ఎండీ దాఖలు చేసిన అఫిడవిట్​ను అన్ని రాజకీయ పార్టీలు ఖండిస్తున్నాయని తెతెదేపా అధ్యక్షుడు ఎల్​.రమణ అన్నారు. ఐఏఎస్​ అధికారి రాజకీయ నేతగా వ్యవహరించడం సరికాదని మండిపడ్డారు.

'ఐఏఎస్​లే రాజకీయ నాయకుల్లా వ్యవహరిస్తే'

By

Published : Nov 17, 2019, 4:11 PM IST

'ఐఏఎస్​లే రాజకీయ నాయకుల్లా వ్యవహరిస్తే'

44 రోజులుగా కార్మికులు తమ సమస్యలపై పోరాడుతుంటే ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని తెతెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్​ ముషీరాబాద్​లోని రిసాల్​గడ్డలో స్టాఫ్​ అండ్​ వర్కర్స్​ ఫెడరేషన్​ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగమూర్తి నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపారు.

దీక్షా శిబిరాన్ని ఎల్​.రమణతో పాటు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, తెజస అధ్యక్షుడు కోదండరాం, భాజపా ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి సందర్శించారు. లింగమూర్తి దీక్షకు మద్దతునిచ్చారు.

కార్మికుల పక్షాన వ్యవహరించాల్సిన ఆర్టీసీ ఇంఛార్జీ ఎండీ రాజకీయ నాయకుడిగా వ్యవహరించారని తమ్మినేని మండిపడ్డారు. ఇళ్లలోనే దీక్షలు చేస్తున్న ఆర్టీసీ నేతలను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని కోదండరాం అన్నారు. ఈనెల 19న నిర్వహించనున్న సడక్​ బంద్ యథావిథిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details