తెలంగాణ

telangana

By

Published : Feb 26, 2021, 6:54 AM IST

ETV Bharat / state

పురపాలికల్లో హోరెత్తుతున్న ఎన్నికల ప్రచారం

ఏపీలో పురపాలక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ప్రచారం ఊపందుకుంటోంది. గెలుపే లక్ష్యంగా అధికార, విపక్ష పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ముఖ్యంగా నగరపాలికల్లో పట్టు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నాయి.

municipal elections in ap
ఏపీలో పురపాలిక ఎన్నికలు

పార్టీ గుర్తులతో జరిగే ఆంధ్రప్రదేశ్‌ పురపాలక ఎన్నికలను అన్ని రాజకీయపక్షాలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ప్రచారం నిర్వహిస్తున్నాయి. కీలక నేతలు రంగంలోకి దిగి.. అభ్యర్థుల తరఫున రోడ్‌షోలు, ఇంటింటికి ప్రచారం నిర్వహించడంతో శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. కృష్ణా జిల్లా నందిగామలో తెలుగుదేశం నేత నారా లోకేశ్‌ ప్రచారం నిర్వహించారు. పంచాయతీ ఎన్నికల్లో చూపిన తెగువ.. పురపాలికల్లోనూ చూపాలని శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. పురపాలనకు పంచసూత్రాల పేరిట ఎన్నికల మేనిఫెస్టోను ఆయన ఇవాళ పార్టీ కేంద్ర కార్యాలయంలో విడుదల చేయనున్నారు.

పోటాపోటీగా

విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైకాపా, తెలుగుదేశం, వామపక్షాలు పోటాపోటీగా ప్రచారం నిర్వహించాయి. 17వ డివిజన్‌ ప్రచారంలో ఇరుపార్టీలు ఎదురుపడి నినాదాలు చేసుకోవడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. పశ్చిమ నియోజకవర్గంలో 39వ డివిజన్ అభ్యర్థి విషయంలో ఎంపీ కేశినేని నాని తన పంతం నెగ్గించుకున్నారు. ఆయన సూచించిన అభ్యర్థికే టికెట్‌ ఖరారు చేయడంతో.. కేశినేని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 32వ డివిజన్‌లో ఎమ్మెల్యే మల్లాది విష్ణు వైకాపా అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు. 27వ డివిజన్‌లో బోండా ఉమ ప్రచారంలో పాల్గొన్నారు.

విశాఖ మహా నగరపాలక ఎన్నికల్లో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అనకాపల్లిలోని 84వ వార్డులో తెలుగుదేశం అభ్యర్థి ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలో సినీనటి భాజపా తరపున ప్రచారం నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో వివిధ పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కడపలో వైకాపా అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. భాజపా, సీపీఐ అభ్యర్థులు సైతం ప్రచారం ప్రారంభించారు.

పురపాలికల్లో హోరెత్తుతున్న ఎన్నికల ప్రచారం

ఇదీ చదవండి:భారత్​ బంద్​కు పిలుపునిచ్చిన కార్మిక సంఘాలు, ట్రేడ్​ యూనియన్లు

ABOUT THE AUTHOR

...view details