తెలంగాణ

telangana

By

Published : May 28, 2019, 5:26 PM IST

ETV Bharat / state

ఇంటర్​ అవకతవకలపై జూన్​ 2న అఖిలపక్షం మౌనదీక్ష

ఇంటర్​ ఫలితాల్లో అవతకవకలపై ప్రజా, యువజన సంఘాలతో నిరసన కార్యక్రమాలు చేపడతామని అఖిలపక్షం నేతలు తెలిపారు. అధికారులు తమ తప్పులను సరిదిద్దుకోవడం మాని... విద్యార్థులపై అబాండాలు వేస్తున్నారని మండిపడ్డారు. జూన్​ 2న బాధిత కుటుంబాలతో కలిసి సికింద్రాబాద్​లో మౌన దీక్ష చేపడతామని చెప్పారు.

అఖిల పక్షం సమావేశం

ఇంటర్​ ఫలితాల్లో అవకతవకలపై అఖిల పక్షం నిరసన

ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రభుత్వం కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు చేసిందని అఖిలపక్షం నేతలు ఆరోపించారు. ఈ విషయంపై జూన్ 2న సికింద్రాబాద్​లోని గాంధీ విగ్రహం వద్ద బాధిత కుటుంబాలతో కలిసి మౌన దీక్ష చేస్తామన్నారు. అధికారులకు కనువిప్పు కలిగేలా ప్రజా, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.

విద్యార్థులపైనే అబాండాలు

ఇంటర్​ ఫలితాల్లో అవకతవకలపై అధికారులు విద్యార్థులపైనే అభాండాలు వేస్తున్నారని తెదేపా నేత రావుల చంద్ర శేఖర్​రెడ్డి విమర్శించారు. విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్​ చేయాలని డిమాండ్​ చేశారు. ఇటీవల ఎన్నికల ఫలితాలతో తెరాస నేతల బేజారయ్యారని అఖిలపక్షం నేతలు ఎద్దేవా చేశారు.

ఇదీ చూడండి : నేనా.. పార్టీ మారతానా? అంతా ఉత్తముచ్చటే!

ABOUT THE AUTHOR

...view details