NCC Cadets From Telangana at All India Thal Sainik Camp :గత నెల 19వ తేదీ నుంచి 30వ తేదీ వరకు దిల్లీలోని ఎన్‌సీసీ కరియప్పన్ మైదానంలో అఖిల భారత థల్ సైనిక్ పోటీలు జరిగాయి. 17 ఎన్‌సీసీ డైరెక్టరేట్‌లకు చెందిన 1500 మందికి పైగా కాడెట్లు ఇందులో పాల్గొన్నారు. మ్యాప్ రీడింగ్, ఫీల్డ్ సిగ్నల్స్, జడ్జింగ్ డిస్టెన్స్, అబ్‌స్టాకుల్స్ ట్రైనింగ్, టెంట్ పించింగ్ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. తెలుగు రాష్ట్రాలకు కలిపి ఒకే డైరెక్టరేట్ నిర్వహిస్తున్నారు.
శాంతి, భద్రతలపై ఎన్‌సీసీ విద్యార్థులకు అవగాహన
All India Thal Sainik Camp 2023 :ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి 91మంది విద్యార్థులు దిల్లీకి వెళ్లారు. ఇందులో 51 మంది అబ్బాయిలు, 40 మంది అమ్మాయిలు ఉన్నారు. జూనియర్ డివిజన్, సీనియర్ డివిజన్, సీనియర్ వింగ్, జూనియర్ వింగ్ విభాగాలుగా ఏర్పడిన తెలుగు రాష్ట్రాల కాడెట్లకు రెండు పతకాలు దక్కాయి. సీనియర్ వింగ్ లో రజత పతకం.. జూనియర్ డివిజన్‌లో కాంస్య పతకం సొంతం చేసుకున్నారు. షూటింగ్ విభాగంలో మొదటి స్థానం దక్కించుకున్నారు. ఇతర పోటీల్లో పతకాలు దక్కకపోయినా.. ఉత్తమ ప్రతిభ కనబర్చారు. ఓవరాల్‌గా జాతీయ స్థాయిలో రెండో స్థానం దక్కించుకున్నారు. దిల్లీ నుంచి హైదరాబాద్ కు చేరుకున్న ఎన్‌సీసీ కాడెట్ల బృందాన్ని డిప్యూటీ డైరెక్టర్ జనరల్ వీఎం రెడ్డి అభినందించారు.
TelanganaNCC CadetsAt All India Thal Sainik Camp : విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచే దేశభక్తితో పాటు.. క్రమశిక్షణ, సమైక్యత, మనోధైర్యం కల్పించేలా ఎన్‌సీసీ అధికారులు శిక్షణ ఇస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు లక్షా 25వేల మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. 12ఏళ్ల వయసున్న విద్యార్థులను దీనికి ఎంపిక చేస్తారు. వీళ్లు ఓ వైపు చదువుకుంటూనే మరోవైపు శిక్షణ తీసుకునే విధంగా సౌలభ్యం ఉంటుంది. ఎన్‌సీసీలో ఉన్న విద్యార్థులకు ఏ,బీ,సీ సర్టిఫికెట్లతో పాటు.. ఏటా రెండుసార్లు అఖిల భారత థల్ సైనిక్పోటీలుంటాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా దిల్లీలో నిర్వహించే పరేడ్‌లోనూ పాల్గొనే అవకాశం ఉంటుంది.