హైదరాబాద్ నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో జాతీయ ఉద్యానవన, వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి విత్తన, నర్సరీ సంస్థలు, అంకుర కేంద్రాలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, అభ్యుదయ రైతుల ఆధ్వర్యంలో 100 పైగా స్టాళ్లు కొలువు తీరాయి. నగర సేద్యం కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో... ఈ ప్రదర్శనకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రత్యేకించి నగర సేద్యానికి సంబంధించి ఇంటి పంటలు, టెర్రస్ గార్డెనింగ్, బాల్కనీల్లో కూరగాయలు, పూలు, పండ్ల మొక్కల పెంపకం సంబంధించిన వివిధ ఆకృతుల్లో కుండీలు, నీరు, క్రిమిసంహారక మందుల పిచికారీ యంత్రాలు, ఇతర సామగ్రి ప్రదర్శన, విక్రయాలు చేపట్టారు.
పీపుల్స్‌ప్లాజాలో ప్రారంభమైన జాతీయ ఉద్యాన ప్రదర్శన - peoples plaza
హైదరాబాద్ వేదికగా జాతీయ ఉద్యానవన, వ్యవసాయ ప్రదర్శన - 2019 ప్రారంభమైంది. స్వాంతంత్య్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని నెక్లెస్‌రోడ్ పీపుల్స్ ప్లాజాలో ఐదు రోజుల పాటు ప్రదర్శన జరగనుంది. ఉద్యాన శాఖ భాగస్వామ్యంతో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ ఈవెంట్స్ ఆర్గనైజర్స్ ఆధ్వర్యంలో ఇండియన్ రోజ్ ఫెడరేషన్ ఛైర్మన్ నవాబ్ ఖాదర్ అలీఖాన్ ప్రారంభించారు.
పీపుల్స్‌ప్లాజాలో ప్రారంభమైన జాతీయ ఉద్యాన ప్రదర్శన