తెలంగాణ

telangana

ETV Bharat / state

'భారత్ బంద్​ను జయప్రదం చేయండి'

దిల్లీ సరిహద్దులో రైతులు చేస్తున్నది దేశ భక్తి పోరాటమని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం తెలిపింది. కేంద్రప్రభుత్వం ప్రవేశ పెట్టిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఈ నెల 26న చేపట్టిన భారత్ ​బంద్​ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది.

All India Agricultural Labor Union called for the victory of the Bharat Bandh
'భారత్ బంద్​ను జయప్రదం చేయండి'

By

Published : Mar 21, 2021, 9:32 PM IST

కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దులో రైతులు చారిత్రాత్మక పోరాటం చేస్తున్నారని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి వెంకట్ అన్నారు. కార్పొరేట్​ శక్తులకు లాభాలను చేకూర్చే వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్​లోని ఆర్టీసీ క్రాస్​రోడ్డులోని వ్యవసాయ సంఘం కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 26వ తేదీన నిర్వహించనున్న భారత్ బంద్​ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

దిల్లీలో రైతాంగం చేస్తున్న పోరాటం ఈనెల 26 నాటికి నాలుగు నెలలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించనున్న భారత్ బంద్​ను అన్ని ప్రాంతాల్లో జయప్రదం చేయాలని ప్రజా సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెరాస, ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్, వామపక్షాలు బంద్​లో భాగస్వాములు కావాలని కమిటీ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి సాగర్, సీఐటీయు రాష్ట్ర కార్యదర్శి భూపాల్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:పొలం బాటలో ఇంజినీర్..డ్రోన్లతో వ్యవసాయం

ABOUT THE AUTHOR

...view details