తెలంగాణ

telangana

ETV Bharat / state

lock down: సడలింపు సమయం పెంపుతో అన్ని వర్గాలకు ఊరట - తెలంగాణ వార్తలు

ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ లాక్​డౌన్ ఆంక్షల సడలింపుతో కాస్త వెసులుబాటు కల్పించినట్లయ్యింది. వ్యాపార కార్యకలాపాల నిర్వహణకు అనువుగా ఉంటుందని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. చిరువ్యాపారులు, దుకాణాల్లో పనిచేసే ఉద్యోగులకు ఊరట లభించింది.

relaxation time, lock down
లాక్​డౌన్, లాక్​డౌన్ మినహాయింపు

By

Published : May 31, 2021, 10:37 AM IST

హైదరాబాద్​ గరం తేరుకుంటోంది. కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. లాక్‌డౌన్‌ ఆంక్షలు ఫలితాన్నిస్తుండడంతో ప్రభుత్వం జూన్‌ 9 వరకూ లాక్‌డౌన్‌ను పొడిగించింది. ఈ దఫా ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ఆంక్షల సడలింపుతో కాస్త వెసులుబాటు కల్పించినట్లయ్యింది. మధ్యాహ్నం 2 గంటల వరకూ ఇళ్లకు చేరే అవకాశం ఇచ్చింది. లాక్‌డౌన్‌ సమయం పొడిగింపుతో వ్యాపార కార్యకలాపాల నిర్వహణకు అనువుగా ఉంటుందని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటివరకు ఉన్న ఆంక్షల నేపథ్యంలో కూరగాయలు, పండ్లు, హోటళ్లపై తీవ్ర ప్రభావం పడింది. ఇతర ప్రాంతాల నుంచి కూరగాయలు తీసుకొచ్చే రైతులు పూర్తిగా విక్రయించలేక పారబోస్తున్న సంఘటనలు వెలుగు చూశాయి. చిరువ్యాపారులు, దుకాణాల్లో పనిచేసే ఉద్యోగులకు ఉపాధి దూరమైంది. ప్రస్తుతం సడలింపు సమయం మరో మూడు గంటల పెంపుతో వీరందరికీ ఊరట నిచ్చినట్లయ్యింది.

తగ్గాయనే ఉదాసీనత వద్దు..


రోజురోజుకూ మెరుగవుతున్న పరిస్థితులు. ప్రభుత్వ/ప్రైవేటు ఆస్పత్రుల్లో ఖాళీ అవుతున్న పడకలు. కరోనా నుంచి మహానగరం క్రమంగా కోలుకుంటోంది. ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న కొవిడ్‌ రోగుల సంఖ్య కూడా తగ్గుతోంది. రెండోదశ కొవిడ్‌ తీవ్రతతో ముందుజాగ్రత్త తీసుకుంటున్నారు. లాక్‌డౌన్‌ ఆంక్షలతో విందులు, వినోదాలు, గుంపుగా చేరటం వంటి వాటికి కళ్లెం వేయటం, మాస్క్‌ధారణ, టీకాలు వంటి అంశాలు సానుకూల ప్రభావం చూపాయి. కొవిడ్‌ వైద్యపరీక్షలకు వస్తున్న అనుమానితుల్లోనూ పాజిటివ్‌ రేటు తక్కువగా నమోదవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కొత్త కేసులు పెద్దగా రాకపోవటంతో పడకలు ఖాళీగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కేసులు తగ్గాయనే భరోసాతో నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రతిఫలం చవిచూడాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.


వారాంతం యథాతథం..


ఆదివారం కూరగాయలు, మాంసాహార కేంద్రాల వద్ద కొనుగోలు దారులు బారులు తీరారు. లాక్‌డౌన్‌ చివరి రోజు కావటంతో మున్ముందు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అభిప్రాయంతో ముందస్తుగా కొనుగోళ్లు జరిపారు. గత వారంతో పోల్చితే తాజాగా జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా కేసులు తక్కువగా నమోదయ్యాయి. లాక్‌డౌన్‌ ఆంక్షలు మంచి ఫలితాలిస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. నగర శివారు, గ్రామీణ ప్రాంతాల్లో కేసులు భారీగా తగ్గుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

ఇదీ చదవండి:CM KCR: వద్దనుకున్నా లాక్​డౌన్​ తప్పడం లేదు: కేసీఆర్​

ABOUT THE AUTHOR

...view details