సూర్యవైపే అన్ని వేళ్లు...? - ENQUIRY
అతని వల్లే చనిపోయిందని కుటింబీకులు ఆరోపిస్తున్నారు. సెల్ఫోన్, డైరీ ఆధారాలు అతన్నే అనుమానించేలా చేస్తున్నాయి. మరి పోలీసుల దర్యాప్తులో తెలిందేంటి..? ఆరోపణలు ఎదుర్కొంటున్న సూర్య విచారణలో చెప్పిన నిజాలేంటి...?
సూర్య అన్ని విషయాలు చెప్పాడు...!
బుల్లి తెర నటి ఝాన్సీ ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె సన్నిహితుడు సూర్యని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇద్దరి మధ్య తలెత్తిన విభేదాలపై ప్రశ్నించినట్లు తెలిపారు. విచారణలో సూర్యతేజ తెలిపిన కీలక విషయాలు పంజాగుట్ట ఏసీపీ విజయ్ కుమార్ మాటల్లోనే...