తెలంగాణ

telangana

ETV Bharat / state

బెండకాయల మాటున మందు బాటిళ్లు.. 100 లిక్కర్​ సీసాలు స్వాధీనం

శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అవలంభిస్తున్నారు తెలంగాణ లిక్కర్ అక్రమ రవాణా దారులు. ఆంధ్రప్రదేశ్​లో మద్యం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీనితో తెలంగాణ నుంచి అక్రమంగా మద్యం తీసుకొచ్చి రాష్ట్రంలో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. వీటికి తెలంగాణ, ఆంధ్ర సరిహద్దు గ్రామాలు వారధిగా మారాయి.

alcohol-smuggling-in-andhra-telangana-border-at-krishna-district
బెండకాయల మాటున మందు బాటిళ్లు.. 100 లిక్కర్​ సీసాలు స్వాధీనం

By

Published : Jul 27, 2020, 5:22 PM IST

ఆంధ్రప్రదేశ్​లో మద్యం ధరలు పెరగడం అక్రమదారులకు ఆంధ్ర-తెలంగాణ సరిహద్దు గ్రామల నుంచి మద్యం అక్రమ రవాణా లాభసాటి వ్యాపారంగా మారింది. మద్యాన్ని అక్రమంగా తీసుకొచ్చి రాష్ట్రంలో ఎక్కువ ధరలకు అమ్ముకునేందుకు కొత్త మార్గాలు వెతుకుతున్నారు. వారికి చెక్ పెట్టేందుకు ఏపీ ఎక్సైజ్, పోలీస్ శాఖలు మూకుమ్మడిగా దాడులు నిర్వహిస్తున్నాయి. అయినప్పటికీ వివిధ మార్గాల ద్వారా తెలంగాణ నుంచి మద్యాన్ని అక్రమంగా రాష్ట్రంలోకి తీసుకొచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

తెంలంగాణ సరిహద్దు గ్రామాల్లో ఒకటైన విస్సన్నపేట మండలంలోకి బెండకాయల సంచిలో మద్యం బాటిళ్లను దాచిపెట్టి రాష్ట్రంలోకి తీసుకొస్తున్న వారిని ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి వందకు పైగా మందు సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఇలా మద్యం అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

ఇదీ చూడండి :రాజ్​ భవన్​ వద్ద ఆందోళనకు కాంగ్రెస్ యత్నం.. నేతల అరెస్టు

ABOUT THE AUTHOR

...view details