హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో అఖిల భారత మహిళా సాంస్కృతిక సమాఖ్య, అఖిల భారత డెమొక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలను నివారించాలని డిమాండ్ చేశారు. వరంగల్‌లో తొమ్మిది నెలల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి, హత్య చేసిన నరహంతకుడు ప్రవీణ్‌ను కఠినంగా శిక్షించాలని వారు నినాదాలు చేశారు. పసిపిల్లలపై అత్యాచారాలకు కారణమవుతున్న మద్యం, మాదకద్రవ్యాలు, అశ్లీలత, పోర్నోగ్రఫీలను నిషేధించాలని డిమాండ్ చేశారు.
వరంగల్ ఘటనను ఖండిస్తూ హైదరాబాద్‌లో ర్యాలీ - ryally
రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను నివారించాలని డిమాండ్ చేస్తూ బషీర్ బాగ్‌లో మహిళా, విద్యార్థి సంఘాలు హైదరాబాద్‌లో ప్రదర్శన నిర్వహించాయి. వరంగల్ ఘటన నిందితున్ని కఠినంగా శిక్షించాలని నాయకులు డిమాండ్ చేశారు.
ర్యాలీ