ఇంజినీరింగ్ కోర్సు నూతన విద్యాసంవత్సరాన్ని సెప్టెంబరు 15 నుంచి ప్రారంభించాలని అఖిల భారత విద్యా మండలి (ఏఐసీటీఈ) నిర్ణయించింది. బీటెక్ మొదటి సంవత్సరం తరగతులను సెప్టెంబరు 1 నుంచి ప్రారంభించాలని గత నెలలో ఏఐసీటీఈ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఏటా ఆగస్టు 1 నుంచి తరగతులు ప్రారంభం కావాలి. కరోనా పరిస్థితులను సమీక్షించిన ఏఐసీటీఈ.. ఈసారి విద్యా సంవత్సరాన్ని సెప్టెంబరు 15వ తేదీ నుంచి ప్రారంభించేలా కాలపట్టికను విడుదల చేసింది.
సెప్టెంబరు 15నుంచి ఇంజినీరింగ్ విద్యా సంవత్సరం
కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. భారత్లో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో విద్యా సంవత్సరం వాయిదా పడింది. దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్ తరగతులు సెప్టెంబర్ 15నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) రివైజ్డ్ అకడమిక్ క్యాలెండర్‌ను జారీ చేసింది.
సెప్టెంబరు 15నుంచి ఇంజినీరింగ్ విద్యా సంవత్సరం
జులై 15వ తేదీలోపు విశ్వవిద్యాలయాలు కళాశాలలకు అనుబంధ గుర్తింపు ఇవ్వాలని, మొదటి విడత బీటెక్ సీట్ల కేటాయింపును ఆగస్టు 30లోగా, రెండో విడత కౌన్సెలింగును సెప్టెంబరు 10వ తేదీలోపు పూర్తి చేయాలని నిర్ణయించింది. పాత (రెండు, మూడు, నాలుగు సంవత్సరాల) విద్యార్థులకు ఆగస్టు 16 నుంచి తరగతులను మెుదలు పెట్టాలని సూచించింది.
ఇవీ చూడండి: 'గిరిజన విశ్వవిద్యాలయంలో తరగతులు ప్రారంభించండి'