గవర్నర్ తమ అధికారాన్ని ప్రయోగించి.. కరోనా కట్టడి విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి తగు సూచనలతో ఆదేశాలు జారీ చేయాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ విజ్ఞప్తి చేశారు. కరోనా కట్టడి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్న గవర్నర్ వ్యాఖ్యలతో తాము ఏకీభవిస్తున్నట్టు ఆయన తెలిపారు.
గవర్నర్ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నాం : దాసోజు శ్రవణ్
కరోనా కట్టడి విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని రాష్ట్ర గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలను తాము స్వాగతిస్తున్నట్టు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ అన్నారు. కరోనా విషయంలో గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వానికి తగు సూచనలు చేస్తూ.. ఆదేశాలు జారీ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
కరోనా విషయంలో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఇదే విషయాన్ని చెప్పినా తెరాస ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు గవర్నర్ కూడా ఇదే మాట చెప్పారని, రాజ్యాంగబద్ధమైన హోదాలో ఉన్నందున కనీసం గవర్నర్ మాటలతో కాకుండా.. ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోరారు. కేంద్రంలో భాజపా, రాష్ట్రంలో తెరాస ప్రజలను మభ్యపెడుతూ మోసం చేస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు. భాజపా నాయకులు రాష్ట్రంలో పరిస్థితులను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి తీసుకోవాల్సిన చర్యలకై ఒత్తిడి పెంచాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి:కొత్త విద్యా విధానం... కొన్ని సవాళ్లు!