భాజపా జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా మాటలు రాజకీయ ద్వంద్వనీతికి అద్దంపడుతున్నాయని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ ఆరోపించారు. జేపీ నడ్డా కేసీఆర్ సర్కారుపై చేసిన ఆరోపణలన్నీ కాంగ్రెస్ చాలా రోజుల నుంచి చేస్తున్నవేనని స్పష్టం చేశారు. కేసీఆర్ అవినీతిపై ఇప్పటి వరకు ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. నడ్డా, లక్ష్మణ్ చేసిన విమర్శలపై కేసీఆర్ సర్కారు కేసులు పెడుతుందా అని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో విమర్శలు చేసే సామాన్యులపై కేసులు పెట్టే ప్రభుత్వం చేతనైతే నడ్డాపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. అమిత్ షా రాజకీయాలన్నీ రక్తపు మరకలతోనేనని చెప్పారు. సోనియాపై విమర్శలు చేసే ముందు లక్ష్మణ్ మీ నాయకుడి చరిత్ర తెలుసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీని విమర్శించే హక్కు భాజపాకి లేదని మండిపడ్డారు.
జేపీ నడ్డాది ద్వంద్వనీతి: సంపత్ - ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్
భారతీయ జనతా పార్టీ నిర్వహించిన సభలో ఆ పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడిన తీరుపై కాంగ్రెస్ నేత సంపత్‌కుమార్ మండిపడ్డారు.
జేపీ నడ్డాది ద్వంద్వనీతి :ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్