తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇంటిపట్టున ఉండు.. విజ్ఞానం చేతపట్టు!

ఇంట్లో కుండలో ఉన్న నీరు ఎందుకు చల్లగా ఉంటుంది? కాంతి వక్రీభవనాన్ని ప్రయోగ రూపంలో ఎలా చూడొచ్చు?ఇలాంటి ప్రశ్నలకు విద్యార్థులే సమాధానాలు కనుక్కొనేలా చేయాలన్నది లక్ష్యం. అనుకోకుండా వచ్చిన సెలవుల్లో ఇంటిపట్టున ఉంటూ చిన్నపాటి ప్రయోగాలు చేస్తూ శాస్త్ర విజ్ఞానాన్ని పెంపొందింపజేయాలన్న ఉద్దేశంతో హైదరాబాద్‌ జిల్లా సైన్స్‌ విభాగం, అగస్త్య ఫౌండేషన్‌ సంయుక్తంగా కృషి చేస్తున్నాయి. ఇందుకు ప్రత్యేక వాట్సాప్‌ గ్రూపులు తయారు చేసి సైన్స్‌పై జిజ్ఞాస పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు.

agastya foundation support to children's education
agastya foundation support to children's education

By

Published : Apr 30, 2020, 11:31 AM IST

హైదరాబాద్‌ జిల్లా సైన్స్‌ విభాగం ఆధ్వర్యంలో 15 రోజుల కిందట 4 వాట్సాప్‌ గ్రూపులు తయారు చేశారు. ఒక గ్రూపులో ప్రత్యేకంగా సబ్జెక్టు నిపుణులుంటారు. అగస్త్య ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో బయాలజీ, ఫిజికల్‌ సైన్స్‌ పరంగా నిపుణుల సూచనలతో ప్రయోగాలు చేస్తూ వీడియో తీస్తారు.

6 నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశాల్లోని ప్రయోగాల్లో నిత్యం ఒకటి ఎంపిక చేసి ప్రతక్ష్యంగా చేసి చూపిస్తూ వాట్సాప్‌ గ్రూపుల్లో పంపుతున్నారు. ఆ ప్రయోగాలను విద్యార్థులు సొంతగా చేసి వీడియో తీసి అప్‌లోడ్‌ చేస్తారు. సబ్జెక్టు నిపుణులు, అగస్త్య ఫౌండేషన్‌ సభ్యులు, ఉపాధ్యాయులు కలిసి.. ఆ వీడియోలను వేర్వేరు గ్రూపులకు షేర్‌ చేస్తారు.

ఇలా నిత్యం 4 వేల మందికి సైన్స్‌ ప్రయోగాలు చేరువయ్యేలా కృషి చేస్తున్నారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోనే కాకుండా తెలంగాణ, ఏపీలోని ఇతర జిల్లాల విద్యార్థులు ఈ క్రతువులో భాగస్వాములవుతున్నారు. సెలవుల్లో తమ మేధస్సు, ఆలోచనలను ప్రయోగాల వైపునకు మళ్లిస్తూ సరదాగా గడుపుతున్నారు.

ఇంట్లో ఉండే ప్రయోగాలు చేసేలా ప్రణాళిక...

విద్యార్థులను శాస్త్ర విజ్ఞానం వైపు మళ్లించాలనే ఉద్దేశంతో చేపట్టిన ఈ కార్యక్రమానికి అగస్త్య ఫౌండేషన్‌ ఎంతో సహకరిస్తోందని హైదరాబాద్​ జిల్లా సైన్స్‌ అధికారి జి.ప్రభాకర్‌ తెలిపారు. ప్రస్తుతం ఎవరూ బయటకు వెళ్లే అవకాశం లేదు.. ఇంట్లో ఉన్న వస్తువులతోనే ప్రయోగాలు చేసేలా రూపకల్పన చేశామన్నారు. ఇందులో భాగస్వాములు కావాలనుకొనే విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు.. 93462 73583, 96522 29582 నంబర్లలో సంప్రదించవచ్చని చెప్పారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details