తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏడుగంటల సుదీర్ఘ శస్త్రచికిత్స అనంతరం... - అదనపు కమిషనర్​ షికాగోయల్​

ప్రేమోన్మాది దాడితో తీవ్రంగా గాయపడిన మధులిక ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోంది. సుమారు 7 గంటలపాటు శస్త్రచికిత్సలు చేసిన వైద్యులు..ఆరోగ్య పరిస్థితిపై సంతృప్తి వ్యక్తంచేశారు. అదనపు పోలీస్ కమిషనర్​ షికాగోయల్​ బాధితురాలిని పరామర్శించారు. నిందితున్ని కఠినంగా శిక్షిస్తామని హామీఇచ్చారు.

మధులిక ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోంది

By

Published : Feb 8, 2019, 9:32 PM IST

మధులిక ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోంది
ప్రేమోన్మాది చేతిలో తీవ్రంగా గాయపడి.. యశోద ఆస్పత్రిలో 48 గంటలుగా అత్యవసర చికిత్స పొందుతున్న మధులిక ఆరోగ్య పరిస్థితి కొంత కుదుటపడిందని వైద్యులు తెలిపారు. చికిత్సకు బాధితురాలు సహకరిస్తోందని.. సైగలు ద్వారా అడిగిన ప్రశ్నలకు ప్రతిస్పందిస్తోందని తెలిపారు.

సుమారు ఏడుగంటల సుదీర్ఘ చికిత్సను విజయవంతంగా పూర్తిచేసినట్లు వైద్యులు వెల్లడించారు. మరికొంత సమయం గడిస్తే వెంటిలేటర్​ తొలగించే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చెందవద్దని కోరారు.
యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మధులికను నగర అదనపు పోలీస్​ కమిషనర్​ షికాగోయల్​ పరామర్శించారు. గతంలో బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు నిందితుడు భరత్​కు కౌన్సిలింగ్​ ఇచ్చామని తెలిపారు. కానీ అంతలోనే ఈ దారుణానికి పాల్పడతాడని ఊహించలేదన్నారు. ​
మధులిక ఆరోగ్యం మెరుగుపడుతోందన్న వైద్యుల ప్రకటనతో బంధువుల్లో ఆనందం వ్యక్తమైంది. నిందితున్ని కఠినంగా శిక్షించి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు.

ABOUT THE AUTHOR

...view details