లాక్డౌన్(Lock Down) నుంచి న్యాయవాదులకు మినహాయింపు ఇవ్వాలని న్యాయవాది సి.కోమిరెడ్డి రాష్ట్ర మానవహక్కుల కమిషన్(HRC)ను కోరారు. మే 12 నుంచి రాష్ట్రంలో లాక్డౌన్ అమలు చేస్తున్నారు. ప్రస్తుతం కోర్టు ప్రొసీడింగ్స్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుపుతున్నా ... ఆయా కేసులకు సంబంధించిన పత్రాలను సిద్ధం చేయాలంటే న్యాయవాదులు కచ్చితంగా కార్యాలయాలకు వెళ్లాల్సి ఉంటుందని ఆయన తన అభ్యర్థన పత్రంలో పేర్కొన్నారు.
ఈ క్రమంలో కార్యాలయాలకు వెళ్లే న్యాయవాదులు, వారి గుమస్తాలను పోలీసులు అడ్డుకుంటుండటంతో... ఇబ్బందులు పడుతున్నామని ఆయన పేర్కొన్నారు. ఏపీ, దిల్లీ తదితర రాష్ట్రాల్లో ఇచ్చినట్లుగా తెలంగాణలో కూడా న్యాయవాదులు, గుమస్తాలకు మినహాయింపు ఇచ్చేలా... రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర డీజీపీలకు తగిన సూచనలు చేయాలని కోరారు.