ప్రమాదకర పరిస్థితిలో ఉన్న భారత రాజ్యాంగ పరిరక్షణ... ఒకే జాతి, ఒకే రిజర్వేషన్ నినాదాంతో మార్చి ఒకటో తేదీన ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు అద్దంకి దయాకర్ తెలిపారు. బహిరంగ సభకు సంబంధించిన హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో గొడపత్రికను ఆయన ఆవిష్కరించారు.
సీఏఏ వల్ల దళితులకు అన్యాయం: అద్దంకి - Malamahanadu sabha at kakinada on March 1st 2020
మనువాద ముసుగులో రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తున్నారని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు అద్దంకి దయాకర్ ఆరోపించారు. పౌరసత్వ సవరణ బిల్లు వల్ల మైనార్టీలతో పాటు దళితులకూ తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
మాల మహాయుద్ధ భేరి పేరిట నిర్వహించే ఈ బహిరంగ సభకు తమిళనాడు, కర్ణాటక, పాండిచేరి, గోవా, దిల్లీ తదితర రాష్ట్రాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నేతలు పాల్గొంటారని అద్దంకి దయాకర్ తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తొలిసారిగా కాకినాడలో సభను నిర్వహించారని దాన్ని పురస్కారించుకొని ఈసభను కాకినాడులో ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దళితులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు తదితర అంశాలపై సభలో చర్చించనున్నట్లు దయాకర్ పేర్కొన్నారు.
ఇవీ చూడండి:'పోలీసులు లేరు... దిల్లీలో అల్లర్లు ఆపలేం'