తెలంగాణ

telangana

ETV Bharat / state

మెడికల్​ ఎమర్జెన్సీ ప్రకటించాలి: అచ్యుత రావు

డెంగీ, మలేరియా, టైఫాయిడ్, వైరల్ వ్యాధుల విజృంభిస్తున్న దృష్ట్యా... మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించాలని బాలల హక్కుల సంఘం... రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​లో వ్యాజ్యం దాఖలు చేసింది.

Dengue fever

By

Published : Sep 4, 2019, 3:03 PM IST


డెంగీ, మలేరియా, టైఫాయిడ్, వైరల్ వ్యాధుల విజృంభిస్తున్న దృష్ట్యా... మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించాలని బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్యుత రావు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​లో పిటిషన్​ దాఖలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చికిత్స కోసం ప్రత్యేక క్లినిక్​లు... బస్తీల్లో సంచార వైద్యశాలలు వెంటనే ఏర్పాటు చేయాలని కోరారు. ముఖ్యంగా పిల్లలు అధికంగా ఈ వ్యాధుల బారిన పడుతున్నారని తెలిపారు. ఒకరి నుండి మరొకరికి వ్యాధి సోకుతున్నందున పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, విద్యా శాఖ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేయాలని ఆయన మానవ హక్కుల కమిషన్​ను కోరారు.

మెడికల్​ ఎమర్జెన్సీ ప్రకటించాలి: అచ్యుత రావు
ఇవీ చూడండి:సీజనల్ వ్యాధుల నివారణకు ప్రత్యేక చర్యలు: మంత్రి ఈటల

ABOUT THE AUTHOR

...view details