ఏపీలోని విశాఖ విమానాశ్రయంలో జగన్‌పై కోడి కత్తితో దాడి చేసిన నిందితుడు శ్రీనివాసరావు... బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టును ఆశ్రయించాడు. ఈ కేసులో ఎన్ఐఏ దర్యాప్తు పూర్తి చేసి అభియోగపత్రం దాఖలు చేసినప్పటికీ... కరోనా నేపథ్యంలో విచారణపై అనిశ్చితి నెలకొందని పిటిషన్‌లో పేర్కొన్నాడు. 21 నెలలుగా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నానని తెలిపాడు.
కోడి కత్తి కేసు: హైకోర్టును ఆశ్రయించిన నిందితుడు శ్రీనివాసరావు - సీఎం జగన్‌పై దాడి
కోడి కత్తితో దాడి కేసు నిందితుడు శ్రీనివాసరావు ఏపీ హైకోర్టును ఆశ్రయించాడు. బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేశాడు. 21 నెలలుగా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నానని పేర్కొన్నాడు. బెయిల్ ఇస్తే... కోర్టు షరతులకు లోబడి ఉంటానని తెలిపాడు.
కోడి కత్తి కేసు: హైకోర్టును ఆశ్రయించిన నిందితుడు శ్రీనివాసరావు
వృద్ధ తల్లిదండ్రులను పోషించాల్సిన బాధ్యత తనపై ఉందని, బెయిల్ ఇప్పిస్తే కోర్టు షరతులకు లోబడి ఉంటానని పిటిషన్‌లో పేర్కొన్నాడు. బెయిల్ ఇవ్వకపోతే కనీసం 15 రోజుల్లో ఎన్ఐఏ కోర్టులో ముఖ్యమంత్రి జగన్ సాక్ష్యం చెప్పేలా ఆదేశించాలని న్యాయస్థానాన్ని కోరాడు.
ఇవీచూడండి:సచివాలయంలో కూల్చిన మసీద్‌కు అక్కడే నిర్మించాలి: ఓవైసీ