మధులికపై కత్తితో దాడి చేసిన నిందితుడు భరత్‌ని పోలీసులు అరెస్టు చేశారు. తనతో మాట్లాడటం లేదనే మధులికపై భరత్ కత్తితో దాడి చేశాడని హైదరాబాద్ తూర్పు మండలం డీసీపీ రమేశ్ వెల్లడించారు. బాధితురాలి పరిస్థితి విషమంగానే ఉన్నా మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు.
అమ్మాయి చావుబతుకుల్లో...అబ్బాయి కటకటాల్లో...! - POLICE
ఇద్దరి మధ్య స్నేహం వద్దన్నారు. తల్లిదండ్రుల మాట విన్న ఆ అమ్మాయి చనువుగా లేదు. మాట్లాడట్లేదనే అబ్బాయి కోపమే తనలో పాశవికాన్ని ఉసిగొల్పింది. అమ్మాయిని చావుతో పోరాటం చేసేలా చేసింది.
మాట్లాడట్లేదనే దారుణం
ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారైనా... వీరిద్దరి మధ్య స్నేహాన్ని తల్లిదండ్రులు అంగీకరించలేదు. నెల క్రితమే వెల్నెస్ సెంటర్లో కౌన్సిలింగ్ ఇప్పించారు.