ఏపీ నెల్లూరు జిల్లా గూడూరు రైల్వే స్టేషన్లో.. గూడ్స్ రైలు కింద రెండు ప్రాణాలు బలికావల్సిన సంఘటన అది. కానీ.. ఏదో అదృశ్య శక్తి ఆ ఇద్దరిని కాపాడినట్లుగానే.. వారు బయటపడ్డారు. బుధవారం ఉదయం 6.32 గంటలకు ఓ వ్యక్తి.. కంపార్ట్ మెంట్ ఎక్కేెందుకు స్టేషన్కు వచ్చాడు. ఒంగోలు వైపునకు వేగంగా వెళ్తోన్న ఓ గూడ్స్ వెనుక వైపునుంచి ఎక్కేందుకు ప్రయత్నించాడు. వేగాన్ని అందుకోలేక జారి పట్టాలపై పడ్డాడు.
తప్పిన ప్రమాదం.. పట్టాల మీద పడి బతికారు..! కాపాడబోయి..
అతడిని గమనించిన రూప్ కుమార్ అనే రైల్వే ఉద్యోగి.. ఆ యువకుడి ప్రాణాలు కాపాడాలని ప్రయత్నించి అతను సైతం పట్టాలపై పడ్డాడు. ప్రమాదవశాత్తు జారి పడిన వీరిద్దరూ మృత్యువుకు దగ్గరగా వెళ్లొచ్చారు. చివరికి స్వల్ప గాయాలతో బతికి బయటపడ్డారు. వారివురు ప్రాణాలతో బయటపడడంతో అక్కడే ఉన్న రైల్వే ఉద్యోగులు, ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇవీ చదవండి:ఇకపై ఇంటి వద్దే కరోనా పరీక్షలు!