ఒకే కేసులో లంచం తీసుకుంటూ ఆర్ఐ, ఎస్సై.. అనిశాకు అడ్డంగా దొరికిపోయారు. ఓ భూవివాదం కేసులో బాధితుడి నుంచి భారీగా లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కేసు దర్యాప్తు చేపట్టిన అధికారులు మరింత లోతుగా విచారిస్తున్నారు.
హైదరాబాద్ షేక్‌పేట్ తహసీల్దార్ కార్యాలయం రెవెన్యూ ఇన్స్పెక్టర్ రూ. 15 లక్షలు లంచం తీసుకుంటూ... అనిశా అధికారులకు పట్టుబడ్డాడు. షేక్‌పేట ఆర్ఐ నాగార్జునరెడ్డిని.. బంజారాహిల్స్‌లోని ఒకటిన్నర ఎకరాలకు సంబంధించిన భూమి హద్దులు చూపించాలంటూ ఖలీద్ అనే వ్యక్తి ఆశ్రయించాడు. సంబంధిత భూమి... కేసులో ఉండడం వల్ల ఆర్ఐ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివాదం పరిష్కరించాలంటే రూ. 30 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. ఈరోజు రూ. 15 లక్షలు... తహసీల్దార్ కార్యాలయం సమీపంలో తీసుకుంటుండగా... అనిశా అధికారులు దాడి చేసి పట్టుకున్నారు.