తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏసీబీ వలలో లంచానికి కక్కుర్తి పడిన ఆర్​ఐ - secendrabad

పేదింటి ఆడబిడ్డల పెళ్లికోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మి కొందరి అధికారుల లంచగొండితనంతో పక్కదారి పడుతోంది. కల్యాణ లక్ష్మి కోసం దరఖాస్తు చేసుకున్న ఓ మహిళ నుంచి రూ.7 వేలు లంచం తీసుకున్న ప్రత్యేక ఆర్​ఐ ఉమర్​ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

acb-arrested-ri

By

Published : May 22, 2019, 12:24 AM IST

కల్యాణలక్షి కోసం దరఖాస్తు చేసుకున్న తుకారం గేటుకు చెందిన సుధారాణి అనే మహిళ నుంచి రూ.7 వేలు లంచం తీసుకున్న ప్రత్యేక రెవెన్యూ ఇన్​స్పెక్టర్​ ఉమర్​ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇతనికి సహకరించిన అటెండర్​ను విధుల నుంచి సస్పెండ్​ చేస్తున్నట్లు కలెక్టర్​ ఉత్తర్వులు జారీ చేశారు. కల్యాణ లక్ష్మి చెక్కు విషయంలో లంచం ఇవ్వాలంటూ ఆర్​ఐ తనని ఇబ్బంది పెడుతున్నాడంటూ బాధితురాలు ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన అధికారులు తహసీల్దారు కార్యాలంయంలో పలు పత్రాలు పరిశీలించి ఆర్​ఐని అదుపులోకి తీసుకున్నారు.

ఏసీబీ వలలో లంచానికి కక్కుర్తి పడిన ఆర్​ఐ

ABOUT THE AUTHOR

...view details