ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న కరోనా మహమ్మారిని వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవడం ద్వారానే నియంత్రించడం సాధ్యమవుతుందని పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు తమవంతు సాయంగా పద్మారావు నగర్ లోని అభినవ నగర్ కాలనీ తరపున ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 40 వేల చెక్కును మంత్రికి అందజేశారు.
వ్యక్తిగత జాగ్రత్తతో కరోనా నియంత్రణ: తలసాని - సీఎం రిలీఫ్ ఫండ్ న్యూస్
కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు తమవంతు సాయంగా హైదరాబాద్ అభినవ నగర్ కాలనీ వాసులు ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 40 వేల చెక్కును మంత్రి తలసానికి అందజేశారు.
వ్యక్తిగత జాగ్రత్తతో కరోనా నియంత్రణ: తలసాని
కరోనా మహమ్మారికి ప్రజలు భయపడాల్సిన అవసరంలేదని, ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుందని మంత్రి అన్నారు. లక్షణాలు ఉంటే పరీక్షలు చేయించుకోవాలని, కరోనా సోకిన వారికి మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పద్మారావు నగర్ తెరాస ఇంఛార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్, కాలనీ అధ్యక్షుడు రాజేష్ గౌడ్, ప్రసాద్ గౌడ్ తదితరులు ఉన్నారు.