కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలో ... తెలంగాణకు చెందిన ఆర్టీసీ బస్సు వెనుక భాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.స్థానికులు అప్రమత్తం చేయటంతో 28 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
ఆ నలుగురే కాపాడారు
By
Published : Feb 21, 2019, 11:00 AM IST
బస్సులో మంటలు
కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలో ...విజయవాడ నుండి హైదరాబాదుకు వెళ్తున్నఆర్టీసీ గరుడ బస్సు వెనుక భాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి
.జూపూడి గ్రామం వద్ద జాతీయ రహదారిపై బస్సును గమనించిన స్థానికులు బస్సుకి ఎదురుగా నిలిచి ప్రయాణికులను,బస్సు డ్రైవరును అప్రమత్తం చేయడంతో పెను ప్రమాదం తప్పింది.ఆ సమయానికి28మంది ప్రయాణికులు బస్సులో ఉన్నారు.వారిని వేరొక బస్సు లో హైదరాబాద్ పంపారు.నలుగురు యువకులు అరుణ్ కుమార్,నాగరాజు,శివశంకర్,పుష్పరాజు బస్సును వెంబడించి డ్రైవర్ను అప్రమత్తం చేయడం...స్థానికంగా ఉన్న ఇళ్ల నుంచి నీటి మోటార్ల పైపులు లాగి మంటలను ఆర్పడంలో చురుగ్గా వ్యవహరించినట్లు స్థానికులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలనుపూర్తిగా అదుపులోకి తెచ్చారు.