తెలంగాణ

telangana

భగీరథ ప్రయత్నం ఫలించింది.. అగ్రభాగాన నిలిచింది..!

నీటిబొట్టు.. ప్రతి జీవికి అత్యంత కీలకమైనదే.. కాగా మానవాళి మనుగడకు రక్షిత మంచినీరు ఎంతగానో అవసరం. సరైన తాగునీరు లేక రోగాల పాలైన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. ఇక వేసవి వచ్చిందంటే చాలు మారుమూల ప్రాంత ప్రజల పరిస్థితైతే మరీ దారుణం.. బిందెడు మంచినీళ్ల కోసం మైళ్ల కొద్దీ నడక సాగించాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితులన్నింటికీ చరమగీతం పాడింది మిషన్​ భగీరథ. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి ప్రజలందరికీ ఇళ్ల వద్దకే శుద్ధి చేసిన నీటిని నల్లాల ద్వారా అందిస్తూ తెలంగాణ దేశంలోనే అగ్రభాగాన నిలిచింది.

By

Published : Aug 23, 2020, 9:15 AM IST

Published : Aug 23, 2020, 9:15 AM IST

Updated : Aug 23, 2020, 3:37 PM IST

a-special-story-on-mission-bhagiratha-project
భగీరథ ప్రయత్నం ఫలించింది.. అగ్రభాగాన నిలిచింది..!

భగీరథ ప్రయత్నం ఫలించింది.. అగ్రభాగాన నిలిచింది..!

మానవాళి మనుగడకు అతి ముఖ్యమైన మంచి నీటిని శుద్ధి చేసి ఆవాసాలకు అందిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ దేశంలోనే మొదటిస్థానంలో నిలిచింది. ఇంటింటికీ నల్లా కనెక్షన్ల ద్వారా సురక్షిత మంచినీటిని సరఫరా చేయడంలో తెలంగాణ దేశంలోనే అగ్రభాగాన్ని దక్కించుకొంది. కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖకు చెందిన జల్​జీవన్ మిషన్ ఈ విషయాన్ని వెల్లడించింది. రాష్ట్రంలోని 98.3 శాతం ఆవాసాలకు శుద్ధి చేసిన నదీజలాలను నల్లాల ద్వారా అందిస్తున్నట్లు ప్రకటించింది.

అగ్రభాగాన నిలిచి..

తెరాస ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి పూర్తి చేసిన మిషన్ భగీరథ రాష్ట్రాన్ని సమున్నత స్థానంలో నిలిపించింది. ఇంటింటికీ శుద్ధి చేసిన నదీజలాలను నల్లాల ద్వారా అందించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ భగీరథయత్నం అసాధ్యాన్ని సుసాధ్యం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలిపింది. నల్లా కనెక్షన్లలో దేశ సగటు 27.28 శాతం ఉండగా... కేవలం 2.05 శాతంతో పశ్చిమబంగ చివరి స్థానంలో ఉంది. తెలంగాణ తర్వాత 89.05 శాతంతో గోవా రెండోస్థానంలో, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి 87.02తో మూడు, 79.78 తో హర్యానా నాలుగోస్థానంలో నిలిచాయి. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌ 74.16శాతం ఆవాసాలకు నల్లాల ద్వారా తాగునీటిని అందిస్తూ ఐదోస్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా 1,897.93 లక్షల ఆవాసాలు ఉండగా 517.97 లక్షల ఆవాసాలకు నల్లాల ద్వారా తాగునీరు అందుతున్నట్లు జల్​జీవన్ మిషన్ వెల్లడించింది.

ఆంధ్రప్రదేశ్​లో తక్కువే..

రాష్ట్రంలో మొత్తం 54.38 లక్షల ఆవాసాలు ఉండగా 53.46 లక్షల ఆవాసాలకు మిషన్‌ భగీరథ పథకం ద్వారా సురక్షిత తాగునీరు అందుతోందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్​లో 34.71శాతం ఆవాసాలకే నల్లాల ద్వారా తాగునీరు అందుతోంది. ఏపీలో 95.66 లక్షల ఆవాసాలుండగా.. 33.21 లక్షల ఇండ్లకు నల్లా నీరు సరఫరా అవుతోంది.

అన్ని జిల్లాలకు నల్లా నీరు..

కేంద్రం గణాంకాల ప్రకారం ఆదిలాబాద్, కరీంనగర్, మేడ్చల్-మల్కాజ్ గిరి, వరంగల్ అర్బన్ జిల్లాల్లోని అన్ని ఇండ్లకు నల్లానీరు అందుతోంది. సంగారెడ్డి, నాగర్ కర్నూల్, కుమ్రంభీం ఆసిఫాబాద్, జనగాం, నిజామాబాద్, యాదాద్రి భువనగిరి, మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల, జగిత్యాల, ఖమ్మం, కామారెడ్డి జిల్లాల్లో 99శాతం పైగా ఇండ్లకు నల్లాల ద్వారా నీరు సరఫరా చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు 90శాతానికిపైగా నల్లానీరు నీరు అందుతోందని వెల్లడించాయి.

ఇదీ చూడండి :ఆగని వరద.. నిండుకుండలా మారిన జలాశయాలు

Last Updated : Aug 23, 2020, 3:37 PM IST

ABOUT THE AUTHOR

...view details