విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సేవలందించిన చిత్రా రామచంద్రన్‌కు అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. హైదరాబాద్ నాంపల్లిలోని విద్యాభవన్ కాంప్లెక్స్‌లో కొవిడ్ నిబంధనల నడుమ విద్యాశాఖ అధికారులు గురువారం ఆమెను సత్కరించారు. కరోనా ఉద్ధృతి, లాక్డౌన్ వంటి ఛాలెంజింగ్ సమయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుని ఆదర్శంగా నిలిచారని సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ కొనియాడారు.
విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌కు ఘన వీడ్కోలు
విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సేవలందించిన చిత్రా రామచంద్రన్‌కు అధికారులు ఘన వీడ్కోలు పలికారు. ఆమె సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. తన సర్వీసులో సహకరించిన వారందరికీ చిత్రా రామచంద్రన్ కృతజ్ఞతలు తెలియజేశారు.
చిత్రారామచంద్రన్కు వీడ్కోలు, చిత్రా రామచంద్రన్‌కు సన్మానం
ఇంటర్ పరీక్షలు, ఆన్లైన్ తరగతుల నిర్వహణలో చొరవ చూపారని ఇంటర్మీడియట్ కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్ అన్నారు. తన సర్వీసులో సహకారం అందించిన వారందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:పెసరపప్పుతో ఆరోగ్యానికి రాజమార్గం