ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుతో కరోనాపై ప్రజల్లో చైతన్యం నింపేందుకు భాషా సంస్కృతి శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ ఆధ్వర్యంలో యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించారు. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న కవితలు, పాటలను పోస్టు చేస్తూ సామాజిక మాధ్యమాల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు.
సీఎం మెచ్చుకున్న కవిత... రచయిత్రి మాటల్లోనే..
కరోనా మహమ్మారిపై కవితల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించాలన్న ముఖ్యమంత్రి పిలుపుపై ఎందరో రచయితలు, కవులు తమ కలం, గళంతో సిద్ధమయ్యారు. తెలంగాణ సహా పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో కరోనాకు రిటర్న్ గిప్ట్ పేరుతో కవితలు,పాటలు రాస్తూ ప్రజలను చైతన్యం చేస్తున్నారు.
కరోనాపై అవగాహన కల్పిస్తూ రచియిత్రి శ్రీలక్ష్మి కవిత
ఈ సందర్భంగా రచయిత్రి ఐనంపూడి శ్రీలక్ష్మి రాసిన కవితను ముఖ్యమంత్రి ప్రశంసించారు. తన కవితను ముఖ్యమంత్రి మెచ్చుకోవడంపై రచయిత్రి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆ అనుభవాన్ని ఈటీవీ భారత్తో ఆమె పంచుకున్నారు.
ఇవీ చూడండి:కలిసి కట్టుగా ఒకే జట్టుగా కరోనాపై జీ-20 పోరు