తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా లక్షణాలతో వృద్ధుడు మృతి - man dead with corona symptoms

కరోనా లక్షణాలతో వృద్ధుడు మృతి చెందిన ఘటన హైదరాబాద్​ నారాయణగూడలో జరిగింది. జీహెచ్ఎంసీ కరోనా టీం మృతదేహం దగ్గరకు రాని కారణంగా మృతదేహాన్ని సంఘటనాస్థలంలోనే ఓ అంబులెన్సులో ఉంచారు.

A old man dead with corona symptoms in hyderabad
కరోనా లక్షణాలతో వృద్ధుడు మృతి

By

Published : Apr 11, 2020, 11:40 AM IST

హైదరాబాద్ నారాయణగూడలోని వైఎంసీఏ సమీపంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అతని జేబులో దొరికిన డాక్టర్ల ప్రిస్కిప్షన్ల ప్రకారం అతనికి కరోనా లక్షణాలున్నట్లు తేలింది. నేపాల్‌కు చెందిన షర్వద్ బహదూర్(77) హైదరాబాద్ లాలాపేటలోని ఓ వైన్స్ షాపులో వాచ్ మెన్‌గా పని చేస్తున్నాడు. గత కొన్ని రోజులుగా దగ్గు వస్తుండటంతో అక్కడ దగ్గరలోని పీహెచ్​సీ సెంటర్‌కు వెళ్లగా అక్కడి వైద్యులు కింగ్ కోఠి ఆస్పత్రికి రిఫర్ చేశారు.

ఈ నెల 9న మధ్యాహ్నం కింగ్ కోఠి ఆస్పత్రికి వెళ్లిన బహదూర్​ను అక్కడి వైద్యులు 60 సంవత్సరాల పైబడిన వారికి ఈ ఆస్పత్రిలో ఓపీ లేదని.. కరోనా లక్షణాలు కూడా ఉన్నాయని గాంధీ ఆస్పత్రికి రిఫర్ చేశారు. అయితే ఏమైందో తెలియదుగానీ శుక్రవారం సాయంత్రం బహదూర్​ శవమై కనిపించాడు.

డయల్ -100 ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని జీహెచ్ఎంసీకి సమాచారమిచ్చారు. జీహెచ్ఎంసీ కరోనా టీం మృతదేహం దగ్గరకు రాని కారణంగా మృతదేహాన్ని సంఘటనాస్థలంలోనే ఓ అంబులెన్సులో ఉంచారు.

ఇవీచూడండి:తొమ్మిదో తరగతి విద్యార్థి ప్రతిభ.. 9 వేలతో బ్యాటరీ సైకిల్

ABOUT THE AUTHOR

...view details