నగరంలో జానపద కళారూపాల ఊరేగింపు అట్టహాసంగా నిర్వహించారు. ఎల్బీ స్టేడియం నుంచి రవీంద్రభారతి వరకు నిర్వహించిన ఊరేగింపును రాష్ట్ర క్రీడా ప్రాధికారిత ఛైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, బేవరేజస్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ దేవిప్రసాద్ జెండా ఊపి ప్రారంభించారు. నటరాజ్ అకాడమీ 10వ వార్షికోత్సవం సందర్భంగా ఈ ర్యాలీ నిర్వహించారు. మహిళాల కోలాటాలు, పోతారాజుల విన్యాసాలు, లంబాడి నృత్యాలు, బోనాలు, గిరిజన నృత్యాలు, డప్పు చప్పులతో ర్యాలీ కొనసాగింది. జానపద కళలను రక్షించడంతో పాటు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నటరాజ్ అకాడమీ నిర్వాహకులు తెలిపారు.
నగరంలో అట్టహసంగా జానపద కళారూపాల ఊరేగింపు - రవీంద్రభారతి
హైదరాబాద్‌లో నటరాజ్ అకాడమీ ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియం నుంచి రవీంద్రభారతి వరకు నిర్వహించిన జానపద కళారూపాల ఊరేగింపు అట్టహాసంగా జరిగింది. ఈ ర్యాలీని రాష్ట్ర క్రీడా ప్రాధికారిత ఛైర్మన్ వెంకటేశ్వర రెడ్డి, బేవరేజస్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ దేవిప్రసాద్‌లు జెండా ఊపి ప్రారంభించారు.
నగరంలో అట్టహసంగా జానపద కళారూపాల ఊరేగింపు