తెలంగాణ

telangana

ETV Bharat / state

పెట్రోల్​లో శానిటైజర్​ కలుపుకొని తాగి యువకుడు మృతి - పెట్రోల్​లో శానిటైజర్​ కలుపుకొని తాగి నెల్లూరులో యువకుడు మృతి

మద్యానికి బానిసయ్యాడా యువకుడు. లాక్​డౌన్ కారణంగా మందు దొరకడం లేదు. ఏం చేయాలో అర్థం కాక పెట్రోల్​లో శానిటైజర్​ పోస్తే మద్యంలాగే ఉంటుందనుకొని తాగేశాడు. చివరికి ప్రాణం విడిచాడు.

a man died with dirinking Patrol sanitizer at marripad
పెట్రోల్​లో శానిటైజర్​ కలుపుకొని తాగి యువకుడు మృతి

By

Published : Apr 19, 2020, 2:06 PM IST

తాగుడుకి బానిసైన ఓ యువకుడు మద్యం దొరక్క.. పెట్రోల్‌లో శానిటైజర్‌ కలుపుకొని తాగి మృతి చెందాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్​ నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం డీసీ పల్లి ఎస్సీ కాలనీలో శనివారం రాత్రి జరిగింది. నల్లిపోగు నరేష్ అనే ఆ యువకుడు ఉదయం దాటినా ఇంటి నుంచి బయటకు రాకపోవడంపై అనుమానంతో తల్లిదండ్రులు గమనించగా.. అప్పటికే మృతి చెంది ఉన్నాడు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. లాక్‌డౌన్‌ కారణంగా మద్యం దొరక్కపోవడంతో... ఇంట్లో ఉన్న శానిటైజర్‌ను పెట్రోల్‌లో కలుపుకుని తాగినట్లు వారు పోలీసులకు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

పెట్రోల్​లో శానిటైజర్​ కలుపుకొని తాగి యువకుడు మృతి

ABOUT THE AUTHOR

...view details