తెలంగాణ

telangana

ETV Bharat / state

సీఎంవో ఉద్యోగినంటూ మోసం... వ్యక్తి అరెస్టు

సీఎంవో ఉద్యోగినంటూ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని టాస్క్​ ఫోర్స్​ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితున్ని గతంలో పలు కేసుల్లో అరెస్ట్​ చేసి జైలుకు పంపినా... బెయిల్​పై వచ్చి అక్రమంగా డబ్బులు వసూలు చేయడం ప్రారంభించాడు. జస్ట్​ డయల్​ ద్వారా ప్రభుత్వ అధికారులు, పారిశ్రామిక వేత్తల నంబర్లు సంపాదించి మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

By

Published : Jul 27, 2019, 9:27 PM IST

మోసం చేసిన వ్యక్తి అరెస్టు

సీఎం కార్యాలయ ఉద్యోగినంటూ... సబ్ రిజిస్ట్రార్లు, ప్రైవేట్ కంపెనీల యజమానుల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తిని మధ్య మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు హయత్ నగర్ మండలం కుంట్లూరుకు చెందిన రాయబండి సూర్యప్రకాశ్​గా గుర్తించారు. ఇతను స్థిరాస్తి వ్యాపారంలో ఏజెంట్ గా పనిచేస్తున్నాడు. 2009 నుంచి పేర్లు మార్చుకొని సీఎం కార్యాలయ ఉద్యోగినంటూ ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించి డబ్బులు వసూలు చేయడం ప్రారంభించాడు. ఇప్పటికే ఇతన్ని పలు కేసుల్లో అరెస్ట్ చేసి జైలుకు పంపారు. బెయిల్​పై బయటికి వచ్చి యథావిధిగా మోసాలకు పాల్పడుతున్నాడు.

సబ్​ రిజిస్ట్రార్​కు బెదిరింపులు

తన పేరు ఆర్​సీపీ చారి అని... సీఎం కార్యాలయ ఉద్యోగినంటూ... కొన్ని రోజుల క్రితం సిద్దిపేట సబ్​ రిజిస్ట్రార్​కు ఫోన్​ చేశాడు. అన్నదాన కార్యక్రమానికి లక్ష రూపాయలు డబ్బులివ్వాలని... లేకపోతే గ్రామీణ ప్రాంతానికి బదిలీ చేయిస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. సదరు సబ్​ రిజిస్ట్రార్​ సూర్యప్రకాశ్​ ఖాతాలో రూ.55 వేలు జమ చేశాడు. అనంతరం సీఎం కార్యాలయంలో వాకబు చేయగా అలాంటి పేరు గల ఉద్యోగి లేరని తేలింది. మోసపోయానని గ్రహించిన సబ్​ రిజిస్ట్రార్​ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుడు సూర్యప్రకాశ్​ జస్ట్​ డయల్​ ద్వారా ప్రభుత్వ అధికారులు, పారిశ్రామిక వేత్తల నంబర్లు సంపాదించి మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

ఇదీ చూడండి : యువతి కిడ్నాప్​ కేసులో కొనసాగుతున్న వేట

ABOUT THE AUTHOR

...view details