ఉస్మానియా యూనివర్సిటీకి ఎమ్హెచ్ఆర్డీ నుంచి రూసా2 కింద విడుదలైన రూ.100 కోట్ల నిధులపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని తెలంగాణ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజీ ముందు నిరసన చేపట్టారు. ఈ విషయంలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. రూసా నిధుల్లో అధిక శాతం పరిశోధనను ప్రోత్సహించడానికి ఫెల్లోషిప్స్కి ,మౌలిక సదుపాయాలకు వినియోగించాలని తెలంగాణ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోట శ్రీనివాస్ అన్నారు. అలా కాకుండా ప్రభుత్వం ఫెలోషిప్స్ కి అర్హత నెట్, వయసు 28 సంవత్సరాల నిబంధనలు పెట్టడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
'రూసా నిధుల్లో అధిక శాతం పరిశోధనలకు వినియోగించండి' - ఉస్మానియా యూనివర్సిటీ
ఓయూకి రూసా2 కింద విడుదలైన రూ.100 కోట్ల నిధులపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని తెలంగాణ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజీ ముందు నిరసన చేపట్టారు.
'రుసా నిధుల్లో అధిక శాతం పరిశోధనకు వినియోగించండి'