సెప్టెంబర్ 12న జరిగే గణేశ్ నిమజ్జనాలకు సంబంధించి హైదరాబాద్‌లోని జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, జలమండలి, ట్రాఫిక్, పోలీస్, ఆర్ అండ్ బీ, విద్యుత్ శాఖ అధికారులు, భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రతినిధులు పాల్గొన్నారు. హుస్సేన్‌సాగర్ చుట్టూ 29 క్రేన్లు ఏర్పాటు, ఎన్టీఆర్ మార్గ్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు, శానిటేషన్ నిర్వహణ కోసం అదనపు సిబ్బందిని నియమించాలని సమావేశంలో నిర్ణయించారు.
గణేశ్ నిమజ్జనాలపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం - Ganesh
హైదరాబాద్‌లోని జీహెచ్ఎంసీ కార్యాలయంలో గణేశ్ నిమజ్జనాలపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో అన్ని శాఖల అధికారులు హాజరయ్యారు.
ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం