ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని దాసప్పరోడ్డులో జిల్లేడు మొక్కలపై గురువారం కనిపించిన ఓ మిడతల దండు స్థానికంగా కలవరం రేపింది. ఈ గుంపులో 100-150 మిడతలే ఉన్నా.. మహారాష్ట్రలో ఇప్పటికే పంటలను నాశనం చేస్తున్న పెద్ద మిడతల దండు అనుకుని స్థానికులు ఆందోళనకు గురయ్యారు. తర్వాత అవన్నీ దేశీయ మిడతలేనని అధికారులు తెలపడం వల్ల అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఈ మిడతలు... పక్కా లోకల్!
ఏపీలోని అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని దాసప్పరోడ్డులో జిల్లేడు మొక్కలపై గురువారం ఓ మిడతల దండు స్థానికులను ఆందోళనకు గురి చేసింది. మిడతల సమూహాన్ని అగ్నిమాపక అధికారులు సోడియం హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ చేసి చంపేశారు.
ఈ మిడతలు... పక్కా లోకల్!
గురువారం సాయంత్రం మిడతల దండుపై అగ్నిమాపక శాఖ అధికారులు సోడియం హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ చేయడం వల్ల అవన్నీ చనిపోయాయి. పెనుకొండలోనూ ఈ తరహా మిడతల జాడ కనిపించింది. వీటి గురించి కీటక శాస్త్రజ్ఞుడు మురళీకృష్ణను వివరణ కోరగా.. ‘అవన్నీ దేశీయ మిడతలు. ఇవి జిల్లేడు మొక్కల ఆకులనే తింటాయి. ఇతర పంటలకు, మానవులకు ఎలాంటి హాని చేయవు' అని వివరించారు.
ఇవీ చదవండి:మహానగర తాగునీటికి కొండంత అండ!