తెలంగాణ

telangana

ETV Bharat / state

నకిలీ ధ్రువపత్రాలు విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు - నకిలీ ధ్రువపత్రాలు

పలు యూనివర్సిటీలకు చెందిన నకిలీ సర్టిఫికెట్లు తయారుచేసి విక్రయిస్తున్న ముఠాను ఉత్తరమండల టాస్క్​ఫోర్స్​ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి భారీ సంఖ్యలో ధ్రువపత్రాలు, పలు కార్డులు, స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు.

నకిలీ ధ్రువపత్రాలు విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు

By

Published : Aug 3, 2019, 7:02 AM IST

Updated : Aug 3, 2019, 7:12 AM IST

బోగస్​ అకాడమీ స్థాపించి ప్రముఖ యునివర్సిటీలకు సంబంధించి నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి విక్రయిస్తున్న ముఠాను హైదరాబాద్​ ఉత్తరమండల టాస్క్​ఫోర్స్​ పోలీసులు అరెస్టు చేశారు. విశ్వసనీయ సమాచారంతో దాడి చేసిన పోలీసులు నిందితుడితో పాటు ధ్రువపత్రాలు కొనుగోలు చేసిన మరో ఆరుగురిని అరెస్టు చేశారు. మహబూబ్​నగర్​ జిల్లా నారాయణపేట్​కు చెందిన హస్మతుల్లా హైదరాబాద్​లో డిగ్రీ చదివాడు. చార్మినార్​ ఒకేషనల్​ పేరుతో ఓ బోగస్​ కాలేజీని స్థాపించాడు. పలు యూనివర్సిటీలకు చెందిన సర్టిఫికెట్లను సొంతంగా తయారు చేసి గుట్టుగా విక్రయిస్తున్నాడు. అవసరాన్ని బట్టి కోర్సుకో రేటు చొప్పున ధర నిర్ణయించి రూ. 50 వేల నుంచి లక్షా ఐదువేల రూపాయల వరకు వసూలు చేస్తున్నాడు. పట్టుబడిన వారి నుంచి పలు విశ్వవిద్యాలయాలకు సంబంధించిన ధ్రువపత్రాలు, స్టాంపులు, కంప్యూటర్​ స్వాధీనం చేసుకున్నారు.

నకిలీ ధ్రువపత్రాలు విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు
Last Updated : Aug 3, 2019, 7:12 AM IST

ABOUT THE AUTHOR

...view details