తెలంగాణ

telangana

ETV Bharat / state

వైద్యులకు వందనం.. 'గాంధీ'పై పూలవర్షం - flower rain at gandhi hospital

కరోనా మహమ్మారిపై అలుపెరుగని పోరాటం చేస్తున్న యోధులకు రక్షణ దళాలు పూల వందనం చేశాయి. దేశంలోని వివిధ ఆసుపత్రుల్లో కొవిడ్​- 19 బాధితులకు చికిత్స అందిస్తోన్న వైద్యసిబ్బందికి.. యావత్ భారతావని తరఫున సలాం చేసింది. ఆపత్కాలంలో కనిపించే దేవుడికి పూల సత్కారం నిర్వహించాయి మన సైనికదళాలు.

a-flower-salute-to-the-corona-warriors
కరోనా యోధులకు పూల వందనం

By

Published : May 3, 2020, 10:47 AM IST

Updated : May 3, 2020, 11:09 AM IST

వైద్యులకు వందనం.. 'గాంధీ'పై పూలవర్షం

కరోనా యోధులకు పూల వందనం

కరోనాపై ప్రాణాలను ఫణంగా పెట్టి సేవ చేస్తున్న వైద్యులపై సైనికాధికారులు పూల వర్షం కురిపించారు. రాష్ట్రంలో కొవిడ్​- 19 సోకిన వారికి చికిత్స అందిస్తున్న గాంధీ ఆసుపత్రి వైద్య సిబ్బందిని ఐఏఎఫ్ హెలికాప్టర్ల ద్వారా పూలతో అభినందించారు. వైద్యులు, నర్సింగ్, పారిశుద్ధ్య, పోలీసు సిబ్బందికి రక్షణ దళాల సంఘీభావం ప్రకటించాయి.

కొవిడ్ కేంద్రంగా ఏర్పాటైన గాంధీ ఆస్పత్రి.. మహమ్మారి బారి నుంచి ప్రజలను కాపాడేందుకు... అద్భుత త్యాగనిరతి ప్రదర్శిస్తున్న గాంధీ వైద్యులకు.. తెలంగాణ సమాజం సలాం చేస్తోంది.

ఇవీ చూడండి: కరోనాపై పోరుకు కృతజ్ఞతగా యోధులపై పూలవర్షం

Last Updated : May 3, 2020, 11:09 AM IST

ABOUT THE AUTHOR

...view details