ఏపీలో మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లను లెక్కించిన.. అధికారులకు ఓ వింత విన్నపం కనిపించింది. ఓటు హక్కు వినియోగించుకున్న ఓ తాగుబోతు... తన ఆవేదన వ్యక్తం చేశాడు. కొత్త బ్రాండ్ల స్థానంలో పాత బ్రాండ్లను అందుబాటులోకి తేవాలని కోరాడు. లేకపోతే ఇవే చివరి ఎన్నికలు అవుతాయని ఓ రకం బెదిరింపులకు కూడా దిగాడు అనుకోండి. బ్యాలెట్ పత్రానికి ఓ తెల్ల కాగితంపై తమ అభిప్రాయాన్ని పొందుపరిచి పెట్టెలో 'నంద్యాల తాగుబోతుల విన్నపం' పేరుతో ఇలా వేశాడు. లెక్కింపు సమయంలో ఇది గమనించిన పొలింగ్ సిబ్బంది.. కాగితాన్ని పక్కన పెట్టారు. అది వైరల్ అయింది. కర్నూలు జిల్లా నంద్యాల 29వ వార్డు ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎదురైన ఈ ఘటన.. తాగకపోయినా.. తలతిరిగిపోయేలా చేసింది.
కాగితంలో సారాంశం ఇదే..
నంద్యాల తాగుబోతుల విన్నపం