తెలంగాణ

telangana

ETV Bharat / state

శాసనసభలో ఇవాళ్టి నుంచి పద్దులపై చర్చ - telangana varthalu

రాష్ట్ర వార్షిక బడ్జెట్​పై సాధారణ చర్చ, ప్రభుత్వ సమాధానం సోమవారంతో ముగిసింది. నేటి నుంచి శాసనసభలో మూడు రోజుల పాటు శాఖల వారీగా పద్దులపై చర్చ జరగనుంది.

శాసనసభలో ఇవాళ్టి నుంచి పద్దులపై చర్చ
శాసనసభలో ఇవాళ్టి నుంచి పద్దులపై చర్చ

By

Published : Mar 23, 2021, 2:21 AM IST

శాసనసభలో నేటి నుంచి పద్దులపై చర్చ జరగనుంది. ఈ నెల 18న ప్రవేశపెట్టిన రాష్ట్ర వార్షిక బడ్జెట్​పై సాధారణ చర్చ, ప్రభుత్వ సమాధానం సోమవారంతో ముగిసింది. నేటి నుంచి మూడు రోజుల పాటు శాఖల వారీగా పద్దులపై చర్చ జరగనుంది. ఇవాళ రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, పునరావాస, వాణిజ్య పన్నులు, బలహీన వర్గాల గృహ నిర్మాణంపై చర్చ జరగనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళ, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమానికి సంబంధించిన పద్దులపై చర్చ జరగనుంది.

పౌర సరఫరాలు, ఎక్సైజ్, రవాణా, హోం, వ్యవసాయం, సహకార, పశు సంవర్ధక, మత్స్య శాఖల పద్దులపై అసెంబ్లీ చర్చించనుంది. ప్రశ్నోత్తరాల సమయంలో గురుకుల పాఠశాలల స్థాయి పెంపు, కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్, టీఎస్​ఐపాస్, గొర్రెల పంపిణీ, నర్సంపేటలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, పహాడీ షరీఫ్ దర్గా ర్యాప్ నిర్మాణం అంశాలు ప్రస్తావనకు రానున్నాయి.

ఇదీ చదవండి:ఉద్యోగులకు 30 శాతం ఫిట్‌మెంట్‌.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు

ABOUT THE AUTHOR

...view details